Header Banner

ఏపీలో రేపటినుంచి ప్రవేశ పరీక్షలకు కౌంట్‌డౌన్ స్టార్ట్! నిమిషం ఆలస్యం అయినా..!

  Mon May 05, 2025 18:31        Education

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు రేపట్నుంచి (మే 6) నుంచి ప్రారంభమవనున్నాయి. మే 6 నుంచి జూన్‌ 13 వరకు దాదాపు ఎనిమిది ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వరుసగా నిర్వహించనుంది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. మే 6న ఈసెట్, 7న ఐసెట్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల వద్దకు నిర్ణీత సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్షల తేదీల వారీగా హాల్‌టికెట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తమ హాల్‌టికెట్‌తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్నును మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.

ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌పై ముద్రించిన వివరాలపై అభ్యంతరం ఉంటే పరీక్షా కేంద్రంలోని అబ్జర్వర్‌ దృష్టికి తీసుకెళ్లాలని, విద్యార్ధులందరూ తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్‌ను మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసెట్‌ కన్వినర్‌ ప్రొఫెసర్‌ బి దుర్గాప్రసాద్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా లేటరల్‌ ఎంట్రీ కింద డిప్లొమా పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్‌ పరీక్ష మే 6వ తేదీన మొత్తం రెండు షిఫ్టులలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరగనుంది. మొదటి షిఫ్టు ఉదయం సెషన్‌ 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఇక మధ్యాహ్నం సెషన్‌ 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సెకండ్ షిఫ్ట్‌లో జరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhravasi #APEntranceExams2025 #ExamCountdown #NoEntryIfLate #APECET #APICET #StudentAlert #HallTicketRules